ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే బీజాపూర్‌ జిల్లాలోని బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధి చీపురుబట్టి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు ఎదురుపడ్డారు. దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి.

 ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన మావోయిస్టుల వద్ద తుపాకులు,పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్‌ చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.