జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్టు కాలని బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి భయబ్రాంతులకు గురైన జనం బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 భవనం లోపల నుండి దట్టమైన పొగ వెలబడుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఏరియాను భవనం ఓనర్స్ స్టోర్ రూమ్ గా వాడుతున్నట్టు తెలుస్తుంది.

 దాని వళ్లే అగ్నిప్రమాదం జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.