ముంబై నగర శివారులో భారీ అగ్నిప్రమాదం..

ముంబై  నగర శివారులో భారీ అగ్నిప్రమాదం..

ముంబై నగర శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భయాందర్‌ ఈస్ట్‌లోని ఆజాద్ నగర్ స్లమ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇండ్లలోని ప్రజలు భయంతో బయటకు పరుగు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలను ఆర్పేందుకు 20 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

 అగ్నిప్రమాదంపై అధికారులు సమీక్ష చేశారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో కొంతమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.  ప్రమాదంలో ప్రాణ నష్టంపై అధికారులు ఆరా తీస్తు్న్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఘటనతో ఆజాద్ నగర్ స్లమ్ ఎరియా అంతటా భారీ మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుంది.