గన్నవరం ఎయిర్ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే..?

గన్నవరం ఎయిర్ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే..?

అమరావతి: విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ అధికారుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో సాఫ్ట్‌వేర్ పరికరాలు, ఇమ్మిగ్రేషన్ గదిలోని స్ప్లిట్ ఎయిర్ కండిషనర్, కస్టమ్స్ అధికారులకు చెందిన లగేజీ బ్యాగులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కస్టమ్స్ అధికారుల గదిలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా..? లేక మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో కస్టమ్స్ అధికారులు, ఎయిర్ పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.