భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడిపోయిన L&T ఆఫీస్

భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడిపోయిన L&T ఆఫీస్

భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబట్ పల్లిలోని ఎల్అండ్టి క్యాంపు కార్యాలయంలో మంటలు చెలరేగాయి. నిప్పు అంటుకొని ఆఫీస్ దగ్ధమైంది. ఆఫీస్లోని కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ కంపెనీ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నిర్మించిన సంగతి తెలిసిందే.

అగ్నికి కార్యాలయం ఆహుతి కావడం గమనార్హం. కార్యాలయంలో విలువైన ఫైల్స్, కంప్యూటర్స్ ఉన్నట్లు సమాచారం. ప్రమాదవశాత్తు నిప్పు రాజుకుందా లేక ఎవరైనా కావాలని నిప్పట్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ అండ్ టీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆఫీస్ ప్రక్కన పొలంలో ఓ రైతు వరి కొయ్యలకు నిప్పంటించినట్లు తెలుస్తుంది.

►ALSO READ | ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు ఉపసంహరించుకోండి: ఏపీ సర్కార్ ను కోరుతూ హరీష్ రావు ట్వీట్