ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనిక జనరల్ హతం!

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనిక జనరల్ హతం!

ఉక్రెయిన్ ప్రధాన నగరాలను చేజిక్కించుకునేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా దాడులు చేస్తున్న రష్యా సేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా సైనిక మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ ఉక్రెయిన్ దాడుల్లో చనిపోయినట్లు తూర్పు యూరప్ కు చెందిన అతిపెద్ద మీడియా సంస్థ నెక్ట్సా ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ పై రష్యా సేనలు దండయాత్ర ప్రారంభించిన తర్వాత... జనరల్ స్థాయి అధికారి చనిపోవడం ఇదే మొదటి సారి. 

ఇప్పటికే రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లో తాము ఎవరిపై పోరాడాలో తెలియక తీవ్ర వేదనకు గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్ బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. పట్టుదలతో పోరాడుతూ తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయడంలేదు. 

మరిన్ని వార్తల కోసం..

రష్యాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వార్నింగ్