23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే చీరలో "మేజర్" తల్లి

23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే చీరలో "మేజర్" తల్లి

స్టార్ హీరో అడవి శేష్ నటించిన మేజర్ చిత్రం ఇటీవలే విడుదలై భారీ సక్సెస్ ను నమోదు చేసిన విషయం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. విడుదలైన కొన్ని రోజుల్లోనే కోట్లలో కలెక్షన్లు వసూలు చేసింది. అయితే 1977, మార్చి 15న కేరళలోని కోజికోడ్ జిల్లా తిరువన్నూర్ గ్రామంలో ఉన్ని కృష్ణన్ నాయర్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ దంపతులకు సందీప్ ఉన్నికృష్ణన్ జన్మించారు. సందీప్ ఉన్నికృష్ణన్ బెంగళూరులోని ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత 1995లో ISC సైన్స్ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ చదివే కాలంలోనే  సైన్యంలో చేరాలని అనుకున్నారు సందీప్ ఉన్నికృష్ణన్. ఆ లక్ష్యంతోనే కన్న కలలను సందీప్ నిజం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా 1999లో మిలటరీ అకాడమీలో జరిగిన సందీప్ ఉన్నికృష్ణన్ పైపింగ్ వేడుకలలో కట్టుకున్న చీరను... మళ్లీ 23 సంవత్సరాల తర్వాత మేజర్ ప్రీమియర్ కోసం తన బిడ్డ జ్ఞాపకార్థం ఆ మాతృమూర్తి మరలా తిరిగి అదే చీరను కట్టుకోవడం అందర్నీ భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఆ సంఘటన అనంతరం అడవి శేషు కూడా ఆ తల్లిని హత్తుకోవడం అక్కడి వారందర్నీ ఆకట్టుకుంది.