నియోజకవర్గ సమావేశాల్లో  6 తీర్మానాలు చేయండి.. బీఆర్​ఎస్​ శ్రేణులకు కేటీఆర్​ పిలుపు

నియోజకవర్గ సమావేశాల్లో  6 తీర్మానాలు చేయండి.. బీఆర్​ఎస్​ శ్రేణులకు కేటీఆర్​ పిలుపు

హైదరాబాద్, వెలుగు : నియోజకవర్గాల్లో ఈ నెల 25న నిర్వహించే బీఆర్ఎస్​ ప్రతినిధుల సమావేశాల్లో ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇన్​చార్జీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్​నిర్వహించారు.

ప్రతినిధుల సభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఒక్కో నియోజకవర్గంలో 2,500 నుంచి 3 వేల మందితో సభలు పెట్టాలని సూచించారు. ఈ ప్రతినిధుల సభలు వచ్చే ఎన్నికలకు బలమైన పునాది రాళ్లు కావాలని, కేసీఆర్​హ్యాట్రిక్​విజయానికి దోహదం చేయాలన్నారు. తొమ్మిదేళ్ల  కేసీఆర్  పాలనలో మారిన రాష్ట్ర ముఖచిత్రం గురించి సమావేశాల్లో చర్చించాలన్నారు.

వ్యవసాయం, సంక్షేమం, పల్లె – పట్టణ ప్రగతి, విద్య – ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయాలన్నారు. ప్రజలను ఆలోచింపజేసేలా తీర్మానాలు ఉండాలన్నారు.