
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. పీఎం పర్యటన సందర్భంగా మంగళవారం సీఎస్అధ్యక్షత కో ఆర్డినేషన్ మీటింగ్ఏర్పాటు చేశారు. శాంతికుమారి మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
పోలీసు శాఖ బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.