లక్ష్మీనారాయణ చెరువులోకి కలుషిత జలాలు రాకుండా చూడండి

లక్ష్మీనారాయణ చెరువులోకి కలుషిత జలాలు రాకుండా చూడండి
  •  మేడ్చల్ కలెక్టర్ కు ఎదులాబాద్ గ్రామ మత్స్యకారుల వినతి 

ఘట్ కేసర్, వెలుగు: ఎదులాబాద్ లక్ష్మీ నారాయణ చెరువులో కలుషిత జలాలు రాకుండా చర్యలు తీసుకోవాలని  గ్రామ మత్స్యకారులు కోరారు. మంగళవారం  మేడ్చల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో  చెరువులోకి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, చర్లపల్లి ఇండస్ట్రియల్  ఏరియా నుంచి కలుషిత రసాయనాలు కలిసినట్టు పేర్కొన్నారు.

దీంతో చెరువులోని 30 టన్నులకుపైగా చేపలు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తంచేశారు. 600 ఎకరాల విస్తీర్ణంలోని చెరువుపై 700 మత్స్యకార కుటుంబాలు, వెయ్యికిపైగా రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, బాలయ్య, నర్సింహ్మ ఉన్నారు.