ఆర్టిస్ట్ కి హ్యాట్సాఫ్:  'రామ్ లల్లా' రూపానికి జీవం పోశాడు...

ఆర్టిస్ట్ కి హ్యాట్సాఫ్:  'రామ్ లల్లా' రూపానికి జీవం పోశాడు...

అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బాల రాముడి రూపంలో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని చూసిన అశేష భారతావని భక్తి పారవశ్యంతో తరించింది. జీవం ఉట్టిపడేలా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి భక్తులంతా ముగ్దులయ్యారు. ఇదిలా ఉండగా బెంగాల్ కి చెందిన కుందు అనే చిత్రకారుడు రామ్ లల్లా విగ్రహానికి నిజం రూపం ఇచ్చాడు. ఒక 9ఏళ్ళ బాలుడుని అచ్చం రామ్ లల్లా లాగా తయారు చేసి తన ప్రతిభతో పాటు భక్తిని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కుందు అనే బెంగాల్ కి చెందిన మేకప్ ఆర్టిస్ట్ ఓకే రోజు అబీర్ అనే 9ఏళ్ళ పిల్లాడిని చూసి రామ్ లల్లా లాగా తయారు చేయాలని ఆలోచన రావటంతో వెంటనే ఆ పిల్లాడి తల్లిదండ్రులను సంప్రదించాడు. ఆ పిల్లాడి తల్లిదండ్రులకు తన ఆలోచన గురించి వివరించగా వారు ఓకే చెప్పారు. వెంటనే పని ప్రారంభించిన కుందు తన భార్యతో కలిసి నెలరోజుల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. వృత్తి రీత్యా బ్యూటీ పార్లర్ నడుపుతున్న కుందు దంపతులు ఈ ప్రక్రియలో అబీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా జగరత్తలు తీసుకున్నారు. కుందు దంపతుల పనితాన్ని చూసి స్థానిక ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా నెటిజనం కూడా ఫిదా అవుతున్నారు.