Beauty Tips : కీరాతో మీ చర్మం నిగనిగలాడుతుందని తెలుసా..

Beauty Tips : కీరాతో మీ చర్మం నిగనిగలాడుతుందని తెలుసా..

* నిగనిగలాడే చర్మం కోసం నిమ్మకాయ రసంతో ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి వదిలించొచ్చు. అందుకని నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటుండాలి. 

* తులసి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. తులసి పొడిలో నీళ్లు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ప్యాక్ ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. 

* బ్లాక్ హెడ్స్ పోవాలంటే కీరదోస ముక్కను ముఖంపై మెల్లిగా రుద్దాలి. అలాగే కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు కూడా కీరదోస వాడొచ్చు. కనురెప్పల మీద కీరదోస ముక్కల్ని కాసేపు ఉంచి, తీసేయాలి. 

* ఒక టొమాటోను ముక్కలుగా తరిగి, రసం తీసి, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రాయాలి. ఇది నేచురల్ బ్లీచ్ల్లో పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సి చర్మం మీద ఉండే డెడ్ సెల్స్ ను తొలగిస్తుంది. ఉప్పు.. చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.