
యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ(Das ka Dhamki) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా.. దర్శకత్వం కూడా వహించాడు ఆడియన్స్ ను మెప్పించాడు విశ్వక్. దీంతో ఆయన తదుపరి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
ఇందులో భాగంగానే విశ్వక్ తాజా చిత్రంపై కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. విశ్వక్ స్పెషల్ రోల్ లో గామీ అనే సినిమా చేశారు. అడ్వెంచరస్ ఫాంటసీ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమాలో విశ్వక్ అఘోర పాత్రలో కనిపిస్తున్నారు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే కంప్లీట్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తోంది.
తాజాగా ఈ సినిమా రన్ టైం ను తెలియజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు గామీ మేకర్స్. ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలు ఉండేలా కట్ చేశారట. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. మరి ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందో, ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నారో అనేది తేలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.