పీఎస్-1 నుండి కార్తి లుక్ వచ్చేసింది 

పీఎస్-1 నుండి కార్తి లుక్ వచ్చేసింది 

ప్రముఖ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం లేటెస్ట్ గా 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. ఈ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్, విక్రమ్ ప్రభు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ పార్టు 1 సెప్టెంబర్ 30న తమిళ, తెలుగు, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. 

రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో రెండు నెలల ముందుగానే చిత్ర బృందం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా 'పొన్నియిన్ సెల్వన్'లో నటించిన ముఖ్యమైన పాత్రలను రివీల్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా హీరో కార్తి లుక్ ను మంగళవారం వదిలారు మేకర్స్. ఇందులో కార్తి వల్లవ రాజన్ వందియ దేవన్ పాత్రలో బ్రేవ్ ప్రిన్స్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.