
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath singh) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు ప్రస్తుతం చిన్న బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో కాస్త బిజీగా ఉన్నకారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది.
అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చ్ 19 ఈ సినిమా నుండి పొలిటికల్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారట మేకర్స్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మార్చ్ 19 కోసం ఇప్పటినుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి పవన్ పాలిటిక్స్ కి ఉపదయోగపడేలా మేకర్స్ ఏమైనా ప్లాన్ చేశారా అనేది చూడాలి.
Expect the unexpected ?
— Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2024
19th March ❤️?❤️?❤️?#UstaadBhagatSingh pic.twitter.com/JZfYC5en6y
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీలే నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. మార్చ్ 19న రాబోతున్న గ్లింప్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.