ఇంటర్​లో మరో 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

ఇంటర్​లో మరో 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో మరో 19 మంది స్టూడెంట్లపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో మహబూబ్ బాద్ లో 12, జనగామలో ఒకరు, ఖమ్మంలో ఒకరు, నిజామాబాద్ లో ఒకరు, నాగర్ కర్నూల్ లో ఇద్దరు, నల్లగొండలో ఇద్దరు విద్యార్థులున్నారు.

మంగళవారం ఇంటర్ సెకండియర్ స్టూడెంట్లకు మ్యాథ్స్ ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 4,68,531 మంది హాజరు కావాల్సి ఉండగా, 4,54,232 మంది అటెండ్ అయ్యారు.