మాలలకు న్యాయం చేయాలి : ఎర్రమళ్ళ రాములు

మాలలకు న్యాయం చేయాలి : ఎర్రమళ్ళ రాములు

సూర్యాపేట, వెలుగు: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని దీనిపై అసెంబ్లీలో చర్చించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎర్రమళ్ళ రాములు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  2004లో సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా వర్గీకరణ జరగడానికి వీల్లేదన్నారు.  ఎస్సీ వర్గీకరణ చేయడం మాలలకు ద్రోహం చేయడమనని విమర్శించారు.  ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి జరుగుతున్న  అన్యాయాన్ని తెలిసేలా చెప్పామన్నారు.

ఇటీవల జరిగిన  డెంటల్ ఎగ్జామ్ లో మాలలకు ఒక్క సీటు కూడా రాలేదని, రాష్ట్ర స్థాయి పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఒక్క పోస్ట్ కూడా లేకపోవడం అన్యాయమని మండిపడ్డారు. కాబట్టి దీన్ని  రద్దుచేసి ఎప్పటిలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  మాల మహానాడు జేఏసీ కన్వీనర్ వీర్జాల వేణు బలరాం, జేఏసీ కో-కన్వీనర్లు కట్ట సైదులు, కట్ట మురళి, నామ వేణు,తుమ్మకొమ్మ విజయ్, జిల్లా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ, మేడ ఉపేంద్ర, దార సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.