ఎస్సీలను వర్గీకరించొద్దు

ఎస్సీలను వర్గీకరించొద్దు

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా  ఎస్సీలను వర్గీకరించవద్దని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య విజ్ఞప్తి చేశారు. ఒక వర్గం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వర్గీకరణ చేపట్టవద్దని కోరారు. ఎస్సీ జాబితాలో చేర్చే  లేదా తొలగించే అధికారం ఆయా రాష్ట్రాలకు ఇస్తే ఏనాటికి అంటరానితనం, వివక్షతలు మాసిపోవన్నారు. 

శుక్రవారం ఆయన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్దర్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణతో జరిగే నష్టాన్ని వివరించారు. తర్వాత ఢిల్లీలో ఉన్న సీఎల్పీ నేత భట్టిని కలిసి.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తొలగించాలని కోరారు. బీజేపీ నేతలు ఎస్సీ వర్గీకరణపై ద్వంద వైఖరీని అవలంబిస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు.