వెలుగు, హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 2వ షోరూమ్‌ను శనివారం ప్రారంభించింది. ఈ సంస్థకు నగరంలో ఇది 12వ స్టోర్. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ మాధవరం రోజా, సంస్థ ఎండీ (ఇండియా ఆపరేషన్స్) సిరాజ్ సమక్షంలో దీనిని ప్రారంభించారు. ఈ స్టోర్‌ను 10 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. సంప్రదాయ, లేటెస్ట్ డిజైన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. బంగారం, వజ్రాలతో రూపొందించిన నగలు, ప్లాటినం, వెండితో పాటు బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్లను కొనుక్కోవచ్చు. మెరుగైన షాపింగ్ అనుభవం కోసం డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
మైన్ డైమండ్ జ్యువెలరీ, ఎరా అన్‌కట్ డైమండ్ జ్యువెలరీ, ప్రెసియా జెమ్‌స్టోన్ ఆభరణాలు ఎథ్నిక్స్ హ్యాండ్‌క్రాఫ్టెడ్ జ్యువెలరీ,డివైన్ ఇండియన్ హెరిటేజ్ జ్యువెలరీ, విరాజ్ రాయల్ పోల్కీ జ్యువెలరీ, జూల్ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్, స్టార్లెట్ కిడ్స్ జ్యువెలరీ వంటి సబ్బ్రాండ్లు కూడా లభిస్తాయి. కస్టమర్లకు సాయం చేయడానికి షోరూమ్‌లో ప్రత్యేకంగా ఎక్స్‌పర్టులను నియమించారు.
షోరూమ్ లాంచ్ గురించి మలబార్ గ్రూప్ చైర్మన్, ఎంపీ అహమ్మద్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, డిమాండ్‌ను అందుకోవడానికి కూకట్‌పల్లిలో షోరూమ్‌ను తెరిచామని చెప్పారు. హైదరాబాద్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. కస్టమర్–సెంటర్డ్ రిటైల్ విధానంతో పాటు నాణ్యత, పారదర్శకత తమ ప్రత్యేకతలు అన్నారు. నగలను తిరిగి అమ్మితే 100 శాతం ధరను తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. కూకట్‌పల్లి షోరూమ్ ద్వారా ఆర్జించిన లాభంలో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థల కోసం, దానాల కోసం కేటాయిస్తామని అహ్మద్ చెప్పారు. తాము 100 శాతం హెచ్‌యూఐడీ కంప్లైంట్ బంగారం (బంగారం స్వచ్ఛతను ధృవీకరించే హాల్‌మార్కింగ్), ఐజీఐ, జీఐఏ సర్టిఫైడ్ డైమండ్స్ వాడుతామని చెప్పారు.
