వనస్థలిపురంలో మలబార్ స్టోర్‌‌‌‌‌‌‌‌

వనస్థలిపురంలో మలబార్ స్టోర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని వనస్థలిపురం దగ్గర  కొత్త స్టోర్‌‌‌‌‌‌‌‌ను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌‌‌‌ ఏర్పాటు చేసింది.  మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్‌‌‌‌ శనివారం  వర్చువల్‌‌‌‌గా ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించగా,  ఎల్‌‌‌‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి  ఆదివారం రిబ్బన్ కట్ చేశారు. వనస్థలిపురం కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ రాగుల వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఎక్స్ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ జిట్ట రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, తదితరులు ఈ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

తమ నగల కలెక్షన్‌‌‌‌ను వనస్థలీపురంకు తీసుకురావడం ఆనందగా ఉందని అహమ్మద్ అన్నారు. అదిరిపోయే డిజైన్‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మైన్‌‌‌‌ డైమండ్‌‌‌‌ , ఎరా అన్‌‌‌‌కట్ డైమండ్, డివైన్ హెరిటేజ్‌‌‌‌, ఎత్నిక్స్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ , ప్రీసియా ప్రీసియస్‌‌‌‌ జెమ్‌‌‌‌స్టోన్‌‌‌‌, విరాజ్‌‌‌‌ రాయల్‌‌‌‌ పోల్కి వంటి బ్రాండ్లు తమ కొత్త స్టోర్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయని మలబార్ గోల్డ్‌‌‌‌ అండ్ డైమండ్స్‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. రోజువారి వేసుకోవడానికి, పెళ్లిళ్లకు, ఇతర సందర్భాల్లో వాడుకునేందుకు వివిధ రకాల నగలను తెచ్చామని వివరించింది. కొత్త స్టోర్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఈ నెల  24  నుంచి వచ్చే నెల 2 వరకు   వివిధ ఆఫర్లను ఇస్తోంది. ప్రతీ బంగారం కొనుగోలుపై అంతే  బరువుండే సిల్వర్‌‌‌‌ను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది.  ప్రస్తుతం ఈ కంపెనీకి 13 దేశాల్లో 340 స్టోర్లు ఉన్నాయి.