- మాలల హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఠల్
సంగారెడ్డి (హత్నూర), వెలుగు: మండలంలోని బోరుపట్ల గ్రామంలో అక్రమంగా ఏర్పాటుచేసిన కల్తీ కల్లు దుకాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్‌కు మాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలల హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ..పర్మిషన్ లేకుండా కల్లు దుకాణం నడపడంతో పాటు కల్తీకల్లు తయారు చేసే అమ్ముతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇల్లీగల్ షాపుకు వత్తాసు పలుకుతున్న సీఐ సాగర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. బోరుపట్లలో రోడ్డు పక్కన పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన కల్లు దుకాణం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఆ షాపును తొలగించాలని లేదంటే గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
