కాకా వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలి : మాలమహానాడు లీడర్ల

కాకా వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలి : మాలమహానాడు లీడర్ల
  • ఎంపీ వంశీకృష్ణకు మాలమహానాడు లీడర్ల వినతి 

లక్సెట్టిపేట/దండేపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం గడ్డం వంశీకృష్ణ సోమవారం లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లో పర్యటించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సదర్భంగా లక్సెట్టిపేట పట్టణం ఐబీ గెస్ట్​హౌజ్​లో ఎంపీని మాలమహానాడు లీడర్లు కలిసి స్థానిక కరీంనగర్​ చౌరస్తా వద్ద మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి విగ్రహ ఏర్పాటు కృషి చేయాలని కోరారు. వినతిపత్రం అందజేశారు.

 మండల పరిధిలోని గ్రామాల్లో అంబేద్కర్​విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని, వివిధ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ మాట్లాడుతూ.. సామాజిక కార్యక్రమాలకు విశాక ట్రస్టు ద్వారా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో లీడర్లు దమ్మ నారాయణ, భూపెల్లి మల్లేశ్, మాలెం చిన్నయ్య, గరిసె రవీందర్, మినుముల శాంతి కుమార్, దమ్మ సునీల్, పెరుగు తిరుపతి, భాస్కర్, నరేశ్ ఉన్నారు. 

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

దండేపల్లి మండల పరిధిలోని ఇద్దరు జర్నలిస్ట్ కుటుంబాలను సోమవారం ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన సాక్షి రిపోర్టర్​ వెంకటేశ్​ తండ్రి మొదంపురం ఓదెలు, గూడెంలో ప్రజాజ్యోతి రిపోర్టర్​ హరీశ్ తల్లి పెరంబుదూర్​ దీప ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబాలను కలిశారు. మృతుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్​ లీడర్లు కేవీ పతాప్, జగన్​మెహన్​ దాస్​, దండపెల్లి మాజీ జడ్పీటీసీ మంద రాజయ్య, మాలమహానాడు లీడర్లు ఉన్నారు.