
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓం రౌత్‌తో తీస్తున్న ఆదిపురుష్ సినిమా పూర్తికాగానే.. ప్రశాంత్ నీల్‌తో సలార్ షూటింగ్ మొదలెట్టేసాడు. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఇందులో కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో చాట్ సెషన్లో పాల్గొంది. ప్రభాస్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అని ఓ ఫ్యాన్ ఆమెను ప్రశ్నించాడు. దీనికి మాళవిక క్రేజీ రిప్లై ఇచ్చింది. ప్రభాస్ కటౌట్‌ను చరిష్మాటిక్ అంటూ పొగిడింది.
దీంతో కామెంట్ సెక్షన్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వీరిద్దరి జోడీని తెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.