ఎర్నాకుళం: కేరళలో ఎనిమిదేండ్ల క్రితం చోటుచేసుకున్న లైంగిక దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్‌కు ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు క్లీన్చిట్ఇచ్చింది. ఈ నేరానికి దిలీప్ప్లాన్చేసినట్టు నిర్ధారణ కాలేదని పేర్కొంటూ అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చగా.. ఆరుగురిని దోషులుగా తేల్చింది. దిలీప్‌తో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా రిలీజ్ చేసింది.
2017 ఫిబ్రవరి 17న ప్రముఖ మలయాళ నటి తన కారులో త్రిస్సూర్ నుంచి కొచ్చి వెళుతుండగా.. కొచ్చి సమీపంలో ఓ కారు నటి కారును వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకు దిగి నటి కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. నటి కారులోకి బలవంతంగా ఎక్కి.. డ్రైవర్‌ను బెదిరించి కారును కొచ్చి వైపు తీసుకెళ్లమని బెదిరించారు. సుమారు రెండు గంటల పాటు కారులోనే నటిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
అలాగే, ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. అనంతరం కారు దిగి పరారయ్యారు. దీంతో భయాందోళనకు గురైన నటి ఓ డైరెక్టర్ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ డైరెక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, ఈ హైప్రొఫైల్ కేసు విచారణలో నటుడు దిలీప్ ఈ నేరానికి ప్లాన్చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 జులై 10న దీలీప్‌ను అరెస్ట్ చేశారు.
సుమారు 3 నెలల జైలు శిక్ష అనంతరం ఆయన బెయిల్ మీద విడుదలయ్యాడు. ఎనిమిదేండ్లకు పైగా సుదీర్ఘ విచారణ తర్వాత సోమవారం
ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు దిలీప్‌తో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు తర్వాత దీలీప్ మాట్లాడుతూ.. తన
ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే ఈ కేసులో ఇరికించారని పేర్కొన్నాడు. కాగా, దోషులకు కోర్టు ఈ నెల 12న శిక్ష విధించనుంది.

