బిగ్ బాస్(Bigg boss) షో వల్ల చాలా మంది జీవితాల్లో మార్పులు వచ్చాయి. కొంతమంది మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటుంటే.. మరికొంత మంది నెగిటివిటీని మూటగట్టుకొని ఫేడౌట్ ఐపోతున్నారు. అయితే తాజాగా.. ఈ షో వల్ల మలయాళీ నటి జీవితమే తలక్రిందులుగా మారిపోయిందట. ఆ నటి మరెవరో కాదు.. ఆర్య. ఆమెను బిగ్ బాస్ షోకి పంపించి తన భర్త వేరే అమ్మాయితో జంప్ అయ్యాడట. ప్రస్తుతం ఈ వార్త మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నటి ఆర్యకు కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. ఆ జంటకు ఒక పాప కూడా ఉంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇటీవల జరిగిన బిగ్ బాస్ కొత్త సీజన్ లో అవకాశం వచ్చింది. దీంతో ఆమెను చాలా ప్రేమగా బిగ్ బాస్ కు పంపించారట భర్త. తీరా షో ముగించుకొని వచ్చి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదట. అసలేం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
ఆ క్షణంలో ఒకవైపు భాద, మరోవైపు అతడిని చంపేయాలనేంత కోపం వచ్చిందని, తనని వదిలించుకునేందుకు బిగ్ బాస్ షోకి పంపారని, ఆ సమయంలో వాళ్లిద్దరూ దుబాయ్ లో ఉన్నారని, కోవిడ్ కారణంగా వెళ్లలేకపోయా అని, ప్రస్తుతం విడాకులు తీసుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటి ఆర్య. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.