విమానంలో హీరోయిన్.. తాగి ఓవరాక్షన్ చేసిన ప్యాసింజర్..

విమానంలో హీరోయిన్.. తాగి ఓవరాక్షన్ చేసిన ప్యాసింజర్..

మలయాళ నటి దివ్యప్రభ విమానంలో తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై విమాన సిబ్బందికి కంప్లైంట్ చేసినా.. వారు కేవలం తన సీటును మాత్రమే మార్చారని ఆరోపించారు.

ఇటీవల ముంబై నుంచి కొచ్చికి వెళ్లే ఎయిరిండియా AI 681లో విమానంలో తన సహ ప్రయాణికుడు తనను వేధించాడని దివ్యప్రభ వెల్లడించింది. ఈ విషయంపై ఎయిర్ హోస్టెస్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ, వారు తన సీటును మాత్రమే మార్చి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని, అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం ఆలోచించాలని కూడా ఆమె అధికారులను కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Also Read : Good Life : ఉద్యోగం, జీవితంలో ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతున్నారా.. ఎందుకు..?

కేరళ పోలీసులకు అధికారికంగా కంప్లైంట్ చేయబోతున్నానన్న దివ్యప్రభ.. కేరళ పోలీసులకు పంపిన ఫిర్యాదు ఇ-మెయిల్ స్క్రీన్‌షాట్‌లతో పాటు జోడించారు. ఎయిరిండియా సిబ్బంది ఇచ్చిన స్పందన సైతం తనను ఎంతో నిరాశపర్చింది చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్‌లైన్ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ పోస్టుపై నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 9న ఈ ఘటన చోటుచేసుకోగా.. విమానయాన సిబ్బంది రియాక్షన్ పై విరుచుకుపడుతున్నారు.