రేప్ విక్టిమ్ గుర్తింపు వెల్లడిస్తే జైలుకే

రేప్ విక్టిమ్ గుర్తింపు వెల్లడిస్తే జైలుకే
  • మల్కాజిగిరి పోలీసుల కఠిన హెచ్చరిక

మల్కాజిగిరి, వెలుగు: బేగంపేటలో ట్రైనీ పైలట్​పై జరిగిన లైంగిక దాడి కేసులో తప్పుడు వార్తలు, బాధితురాలి గుర్తింపును వెల్లడించేలా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున ఊహాగానాలు, అసత్య ప్రచారాలు చేయడం దర్యాప్తుకు ఆటంకంగా మారుతాయన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 72 ప్రకారం బాధితురాలి పేరు, కుటుంబ వివరాలు, నివాసం లేదా ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బయటపెట్టడం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో వివరాలు షేర్ చేసిన వారు వెంటనే వాటిని తొలగించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితురాలి గోప్యతను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, డిజిటల్ ప్లాట్​ఫారమ్​లు, ప్రజలు ఈ విషయంలో సంయమనం పాటించాలని సూచించారు.