ఊరెళ్తారా.. ఉండి ఓటేస్తారా?

ఊరెళ్తారా.. ఉండి ఓటేస్తారా?

హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరిలో ఎప్పుడూ ఎంపీ అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్‍ చేసేది సెటిలర్లే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిం చారు. కానీ ఈసారి ఎలా స్పంది స్తారోనని అభ్యర్థులకు ఇంకా స్పష్టత రావడంలేదు. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉన్నారు. వీళ్లలో సెటిలర్లు దాదాపు స్వస్థలంలోనూ ఓటు హక్కును కలిగి ఉన్నవారని అధికారులు  చెబతున్నా రు. అభ్యర్థి గెలుపును ప్రభావితం చేసే ఈ ఓటర్ల గురిం చి ప్రస్తుతం అన్నిపార్టీల నేతలు ఆందోళన చెం దుతున్నా రు.ఈ లోక్ భ నియోజకవర్గం లో మొత్తం 7 అసెంబ్లీస్థా నాలు ఉన్నాయి. ప్రధానంగా కూకట్‍పల్లి, కు-త్బుల్లా పూర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్​నియోజకవ-ర్గాల్లో అధిక సంఖ్యలో ఆంధ్రా ప్రాంతా నికి చెంది నవారు ఉన్నా రు. సికిం ద్రాబాద్, కంటోన్మెంట్‍ల లోతమిళనాడు, కేరళతోపాటు ఉత్తరాది రాష్ట్రాలకుచెంది నవారు ఉంటున్నా రు. అలాగే ఉప్పల్‍ సెగ్మెం -ట్‍లో మాత్రం తెలంగాణలోని ఇతర జిల్లా లకుచెంది న ప్రజలు ఉంటున్నా రు. 2014 లోక్ భఓటర్ల లెక్కల ప్రకార మల్కాజిగిరిలో 31లక్షలపైచిలుకు ఓటర్లు ఉన్నా రు. దాదాపు15 లక్షలవరకు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉంటున్న-వారు ఉన్నా రు. వీరిలో ప్రధానంగా కూకట్‍పల్లినియోజకవర్గం లో 4.4లక్షల ఓటర్లు నమోదైఉండగా కూకట్‍పల్లి, మూసాపేట, బాలానగర్,ఫతేనగర్, బోరబండ ప్రాంతాల్లో 2 లక్షల వరకుఆంధ్రా సెటిలర్లు ఉన్నారు. మల్కాజిగిరిలో మల్కా-జిగిరి, ఏఎస్‍రావు నగర్, యాప్రాల్ వంటి ప్రాం-తాల్లో లక్ష ఓటర్లు ఉండగా 80వేల వరకు ఇతరరాష్ట్రాల ఓటర్లే ఉన్నా రు. ఇలా మల్కాజిగిరిలోనిదాదాపు నాలుగు అసెంబ్లీ స్థా నాల్లో ఇదే పరిస్థితినెలకొని ఉంది. గతంలో జరిగిన అసెంబ్లీ , ఎంపీఎన్నికల్లోనూ అభ్యర్థిని గెలుపును డిసైడ్‍ చేసిందిసెటిలర్‍ ఓటర్లే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్ని కల్లో ఏక కాలంలోనే ఎంపీ, ఎమ్మెల్యే లకు ఒకేరోజు ఓటేయాల్సి వచ్చింది . దీంతో ఎక్కు వమంది టీడీపీ, కాం గ్రెస్ పార్టీల వైపు మొగ్గుచూపారు. 2016లో జీహెచ్‍ఎంసీ ఎన్ని కల్లో సెటిలర్లు ఏకపక్షంగా టీఆర్ఎస్‍కు ఓటేశారు.దీంతో ఆయా ప్రాంతాల్లో వీరి ఓట్లతోనే అభ్యర్థులు గెలిచారు. కానీ ఈసారి ఏపీలో ఒకేసారి అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలకు ప్రకటన విడుదలకావడంతో ఈసారి సెటిలర్లు ఎక్కడ ఓటేస్తారనే ఆందోళనలో అభ్యర్థులు ఉన్నా రు. ఏపీ నేతలకు అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఇప్పటికేఇక్కడ ఉన్నవారిని ఆయా ప్రాంతాలకు తరలించేందుకు ఏపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నా రు. దీనికితోడు తెలంగాణలో కేవలం ఎంపీ ఎన్నికలు ఉండటంతో ఇక్కడ ఓటు వేయాలా? లేక స్వస్థలంలో ఓటేయాలా అనే డైలామా సెటిలర్లలోనెలకొనింది . ఒకవేళ సొంతూర్లకు సెటిలర్లు పయనమైపోతే మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో ఓటిం గ్ శాతం విపరీతంగా పడిపోతుం దని రాజకీయ వి-శ్లేషకు ల అంచనా. వారంతా తరలివెళ్లకుండా ని-యోజకవర్గం లో ఓటువేసేలా డివిజన్, ఏరియాలవారీగా ఇన్ చార్జ్‍ లను నియమిం చే పనిలో ఆయాపార్టీల నేతలు ఉన్నా రు.

సెటిలర్లు ఎటు వైపు

ఎల్బీనగర్‍ అసెంబ్లీ నియోజకవర్గం లో సెటిలర్లఓట్లు చాలా కీలకమైనవి. ఆంధ్ర ప్రాంతం నుంచిఎల్బీనగర్‍తో పాటు వనస్థలిపురం, కొత్తపేట,దిల్ సుఖ్ నగర్‍ ప్రాంతా లలో వీరి ఓట్లు ఎక్కు వ-గా ఉన్నాయి. ఏప్రిల్‍ 11న ఆంధ్రాలో అసెంబ్లీ ,లోక్ భ ఎన్ని కలు జరగనున్నా యి. స్వస్థలా నికివెళ్తారా లేక నగరంలోనే ఓటు హక్కును వినియో-గిం చుకుంటా రా అనే సస్పెన్స్ కొనసాగుతోంది .సొంతూళ్లకు వెళ్తారనే టాక్‍ కూడా నడుస్తోంది .గతంలో ఎప్పుడూ 50 నుండి 55% కంటే ఎక్కు వపోలిం గ్ జరగలేదు. సెటిలర్లు ఊర్లకు వెళితేపూర్తిగా ఓటింగ్‍ % పడిపోయే అవకాశం ఉంది.

ఎల్బీనగర్‍లో ప్రారంభం కాని ప్రచారాలు

పార్లమెంట్ ఎన్ని కల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఎల్బీనగర్‍ అసెంబ్లీస్థా నంలో ఎన్నికల వేడి కనిపించడం లేదు. మల్కాజిగిరి కాం గ్రెస్ అభ్యర్ధి రేవంత్ డ్డి వారంరోజులుగా ఎల్బీనగర్‍లో పర్యటిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. ముఖ్య నా-యకులను కలుస్తూ సహకరిం చాలని కోరుతున్నా రు. టీ ఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ డ్డి,బీ జేపీ అభ్యర్థి రాం చందర్‍రావు ఒక్కసారి కూడా ఇటువైపు రాలేదు. టీ ఆర్‌‌‌‌ఎస్ శ్రేణులు తమనుముం దుకు నడిపేనాయకుల కోసం ఎదురు చూస్తున్నా రు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ డ్డి కాం గ్రె-స్‍ను వీడి టీ ఆర్‌‌‌‌ఎస్‍లో చేరుతానని ఇప్పటికే ప్రకటిం చినా పార్టీ కండువా కప్పుకోకపోవడంతోఆయన సైతం ముం దుకు రావడం లేదు. ఎల్బీనగర్ టీఆర్‍ఎస్‍ ఇన్ చార్జ్ ఎం.రామ్మోహన్ గౌడ్ప్రచారానికి దూరంగా ఉన్నా రు. 11 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ దిశానిర్దేశం చేసేవారులేక అయోమయంలో ఉన్నా రు. ఇక బీ జేపీ విషయానికి వస్తే పార్టీలో ఎన్ని కల సందడి కనిపిం-చడం లేదు. బీ జేపీ అభ్యర్థి రాం చందర్‍రావు నియోజకవర్గం లో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలఅసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ బీ జేపీ అభ్యర్థిగా పోటీచేసిన పేరాల శేఖర్‍రావు నేటి నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది .