
- గ్రేటర్లో ఎక్కడా 100 మీటర్లు నడవలేని పరిస్థితి
- చెట్లు, చెత్త, బస్టాప్‌లు, ట్రాన్స్ఫార్మర్లతో అడ్డంకులు
- 430 కిలోమీటర్ల మేర ఉన్నా ప్రయోజనం లేదు
- ఆపరేషన్ రోప్‌తో అంతంత మాత్రమే ఉపయోగం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌లోని ఫుట్ పాత్లపై ఎక్కడా నడవలేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల ఫుట్‌పాత్‌లు కనుమరుగవుతున్నాయి. గ్రేటర్ లో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లుండగా, 430 కిలోమీటర్లు ఫుట్ పాత్ లు ఉన్నాయి. అయినా, ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా 100 మీటర్లు ఫుట్‌పాత్‌పై నడవలేని పరిస్థితి నెలకొంది.
గతంలో ఫుట్ పాత్ ల ఆక్రమణ, నిర్వహణపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో డ్యామేజ్అయిన కొన్నిచోట్ల రిపేర్లు చేసి కోర్టుకి ఫొటోలు సమర్పించి చేతులు దులుపుకున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కాంప్రెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) కింద మెయిన్‌రోడ్ల మెయింటనెన్స్కాలపరిమితి పూర్తి కావడంతో ఇప్పుడు ఫుట్‌పాత్‌ల నిర్వహణ జీహెచ్ఎంసీనే చేయాల్సి వస్తోంది. దీంతో రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌లనూ పట్టించుకోవడంలేదు.
నగరమంతా సమస్యనే..
నగరంలో దాదాపు అన్ని చోట్లా ఫుట్‌పాత్‌ల పరిస్థితి దారుణంగానే ఉన్నది. టాయిలెట్లు,అన్నపూర్ణ క్యాంటిన్లో పాటు బస్టాప్‌లను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. ఇవన్నీ ఫుట్‌పాత్‌లపైనే కొనసాగుతుండడం మరో విశేషం.. వీటితో పాటు కేబుళ్లు, డ్రైనేజీల కోసం పైపులను కూడా ఫుట్‌పాత్‌లపై నుంచే వేస్తున్నారు. దీంతో ఎక్కడిక్కడ ఫుట్ పాత్ లు ఎప్పుడూ డ్యామెజ్ గానే ఉంటున్నాయి.
నానల్ నగర్ జంక్షన్ వద్ద ఫుట్ పాత్ పై చెత్త చెట్లు ఉండడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ లోని టోలిచౌకీ బస్టాప్వైపు వెళ్లేవారికి పెద్ద సవాల్ గా మారింది. ఇక్కడ తరచూ మురుగు చేరుతుండడంతో అందులోంచే నడవాల్సి వస్తున్నది. దీనిపై స్థానిక అసిస్టెంట్ మెడికల్ ఆఫ్ హెల్త్‌కు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు.
మెహిదీపట్నంలోనూ ఫుట్ పాత్ లపై చెట్లు, చెత్త ఉండడంతో నడవలేకపోతున్నారు. తాజ్ కృష్ణ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లేమార్గంలో ఫుట్ పాత్ పూర్తిగా డ్యామేజ్అయ్యింది. నిత్యం రద్దీగా ఉండే కోఠి, అమీర్ పేట ప్రాంతాల్లో ఫుట్ పాత్ లను పూర్తిగా వ్యాపారస్తులే ఆక్రమించారు. ఫుట్ పాత్ లపై దర్జాగా దందాలు చేస్తుండడంతో పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
బంజారాహిల్స్‌రోడ్ నెంబర్ 12లో..
బంజారాహిల్స్రోడ్నెంబర్12లో ఎదురెదురుగా ఉండే రెండు ప్రధాన హాస్పిటళ్లుఫుట్పాత్లను కబ్జా చేశాయి. ఇక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులు పాదచారులు ఫుట్పాత్ఎక్కకుండా అడ్డంగా గ్రిల్స్ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు కార్ల పార్కింగ్చేస్తూ ట్రాఫిక్జామ్అవడానికి కారణమవుతున్నారు. కొంచం ముందుకు వెళ్తే ఒక హోటల్తమ కస్టమర్లు కూర్చోవడానికి అనువుగా ఫుట్‌పాత్‌ను మార్చేసుకున్నది. ఈ హోటల్ఎదురుగానే ఫుట్‌పాత్‌పై బస్సులు రాకున్నా బస్టాప్ఏర్పాటు చేశారు. అడ్డంగా గ్రిల్స్ఏర్పాటు చేశారు. ఇక్కడ బస్టాప్ఎందుకు కట్టారో ఎవరికీ తెలియదు. అగ్రసేన్మహరాజ్విగ్రహం నుంచి ఎమ్మెల్యే కాలనీకి వెళ్లేవైపు ఉన్న ఈ ఫుట్‌పాత్‌పై చెట్లు, చెత్త, చెదారం, ఆక్రమణలతో జనాలు నడవడానికి
అవరోధంగా మారింది.
ప్రమాద మృతుల్లో 15 శాతం పాదచారులే...
నగరంలోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించాల్సిన బల్దియా అస్సలు పట్టించుకోవడం లేదు. ఏడాదిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 15 శాతం మంది పాదచారులే ఉంటున్నరని నివేదికలు చెప్తున్నాయి.
ఆపరేషన్ రోప్ అంతంతే..
ఫుట్ పాత్ ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు ఏడాదికోసారి సంయుక్తంగా ఆపరేషన్ రోప్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫుట్ పాత్ లపై నిర్మాణాలు, పార్కింగ్ తదితర ఆక్రమణలపై చర్యలు తీసుకుంటున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలలో 744 ఆక్రమణలను తొలగించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా రాజేంద్రనగర్ సర్కిల్ లోని లక్ష్మిగూడ చౌరస్తా వద్ద 80 ఆక్రమణలను తొలగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ రోప్ తో ట్రాఫిక్ సమస్య కు చెక్ పడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆపరేషన్ రోప్ నిర్వహించిన సమయంలో ఆక్రమణలను తొలగిస్తున్నా కొద్ది రోజులకే యథావిధిగా ఏర్పాటు చేస్తున్నారు.