
సిద్దిపేట జిల్లా తొగుట మండలం.. ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు పహారాలో మల్లన్న సాగర్ పనులు చేయిస్తున్నారు కాంట్రాక్టర్లు. మల్లన్న సాగర్ కోసం భూములివ్వని రైతుల పంట పొలాలు ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో పంటలను ధ్వంసం చేస్తుండటంతో.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కోర్టు స్టే ఉన్నా పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.