కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు : మల్లెపోగు శ్రీనివాస్

కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు : మల్లెపోగు శ్రీనివాస్

మక్తల్, వెలుగు: నకిలీ మదాసీ, మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని నకిలీ మదాసీ, మాదారి కురువల వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్​ మల్లెపోగు శ్రీనివాస్​ కోరారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల15న మక్తల్​లో మదాసీ, మాదరి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్స్  ఇవ్వాలని కోరడం సరైంది కాదన్నారు. కురువలు బీసీ–బీ కులానికి చెందిన వారని పేర్కొన్నారు.

ఏపీలోని హిందూపూర్  ఎంపీ గోరంట్ల మాధవ్  బీసీ కులానికి చెందిన వారని, ఆయన బీసీ–బీ సర్టిఫికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేశారని తెలిపారు. చిత్తశుద్ది ఉంటే ముందు ఏపీలోని కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పించాలన్నారు. కో కన్వీనర్లు సింగిరెడ్డి పరమేశ్వర్, ప్రవీణ్ కుమార్  శ్రీనివాస్, విజయ్ కుమార్, కె శ్రీనివాస్, దీపక్ కుమార్, భైరంపల్లి రఘు, దినేశ్​కుమార్, అశోక్, కర్రెం రవి, బండారి వెంకటేశ్, త్రిమూర్తులు, అంజిలమ్మ, యాదగిరి, రావుల కృష్ణ, సుధాకర్  పాల్గొన్నారు.