పెగాసెస్ పై పార్లమెంట్ లో చర్చ జరగాలి

పెగాసెస్ పై పార్లమెంట్ లో  చర్చ జరగాలి

పెగాసెస్ ప్రాజెక్టు రిపోర్టుపై సుప్రీంకోర్టు విచారణ జరపాలంటూ పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు చేశారు విపక్ష పార్టీల నేతలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పెగాసెస్ పై సభలో చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ సీనియర్ మల్లిఖార్జన్ ఖర్గే. వారికిష్టం వచ్చినట్లు వివరణ ఇచ్చారని, ప్రజాస్వామ్యంలో తప్పకుండా చర్చ జరగాల్సిందేనన్నారు. సభ్యుల గొంతు కూడా వినాల్సిందేనన్నారు. తర్వాత వారు వివరణ ఇవ్వాలన్నారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. స్టాండింగ్ కమిటికి ముందు రెండు ప్రధాన అంశాలు ఉన్నాయన్నారు శశిథరూర్. ఒకటి సిటిజన్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అని చెప్పారు.  ఈ విషయంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి,  సెక్రటరీని ప్రశ్నించే హక్కు స్టాండింగ్ కమిటీకి ఉందన్నారు. సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించడానికి మోడీ  సిద్ధంగా లేరన్నారు.తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని... ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలన్నారు.