గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు దండి వారంతో ప్రారంభమయ్యాయి. బుధవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఒగ్గు పూజారుల సమక్షంలో స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం బెల్లం పాయసం వండి బోనం తీసి మొక్కులు చెల్లించుకున్నారు.
దండివారంతో ప్రారంభమైన జాతర ఉత్సవాలు ప్రతి ఆది, బుధవారాల్లో ఏడు వారాల పాటు డిసెంబర్ 18 వరకు జరగనున్నాయి. సుమారు 18 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా ఆలయానికి హుండీ ద్వారా రూ.84వేల ఆదాయం సమాకూరినట్లు ఈవో విక్రమ్, ఆలయ ఫౌండర్, ట్రస్టీ శాంతయ్య తెలిపారు.
