గద్దర్ భార్యకు డిప్యూటీ సీఎం పరామర్శ

గద్దర్ భార్యకు డిప్యూటీ సీఎం పరామర్శ

పంజాగుట్ట,వెలుగు: దివంగత ప్రజా యుద్ధనౌక గద్దర్ భార్య విమలమ్మను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు. గత రెండు రోజులుగా గాల్ బ్లాడర్ (పిత్తాశయం) సమస్యతో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రి లోని ఆర్సీయూలో చికిత్స పొందుతున్నారు. విమలమ్మ అనారోగ్యం గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్ తో  కలిసి ఆస్పత్రికి వెళ్లారు. 

నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నా రు. మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు. అనంతరం గద్దర్ పిల్లలు వెన్నెల, సూర్యంను భట్టి విక్రమార్క పరామర్శించారు. అమ్మ త్వరలోనే కోలుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.