
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: బీసీ రిజర్వేషన్పై 42శాతం అర్డినెన్స్వద్దని, ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆమె మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి జాప్యం చేస్తుందని ఆరోపించారు.
బీసీ మేధావులు బిల్లు వచ్చే వరకు పోరాటాలు చేయాలని, బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రెస్మీట్లో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ పాల్వయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న, బీఆర్ఎస్ లీడర్లు తదితరులున్నారు.