ఇండియాలో కొట్టేసి.. విదేశాల్లో ఆస్తులు కొన్నాడు

ఇండియాలో కొట్టేసి.. విదేశాల్లో ఆస్తులు కొన్నాడు

దేశంలోని 17 బ్యాంకుల్లో సుమారు రూ.900 కోట్లు బకాయిలు తీసుకున్న  విజయ్ మాల్యా.. మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు. అయితే,  భారత్‌ నుంచి పారిపోయే ముందు విదేశాల్లో కోట్ల విలువైన వ్యక్తిగత ఆస్తులు కొన్నాడని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.  2015-16లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల్లో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను మాల్యా కొనుగోలు చేశాడు. అయితే, 2008 నుంచి 2017 మధ్య మాల్యా దగ్గర అప్పు చెల్లించడానికి తగినంత డబ్బు ఉందని.. కానీ, ఉద్దేశ పూర్వకంగానే అప్పును  ఎగ కొట్టారని సీబీఐ ముంబై కోర్టుకు తెలిపింది.

ఆ టైంలోనే మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం రుణాలు తీసుకున్నాడని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అంతేకాకుండా యూరప్ అంతటా వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేశాడని, స్విట్జర్లాండ్ లోని తన పిల్లల ట్రస్ట్ లకు డబ్బులు బదిలీ చేశాడని కోర్టుకు తెలిపింది. కోర్టు నుంచి అనుమతి తీసుకున్న సీబీఐ.. మాల్యా లావాదేవీల వివరాలను కోరుతూ వివిధ దేశాలకు రిక్వెస్ట్ పంపింది.

2016లో దేశం విడిచి పారిపోయిన మాల్యాను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాల్యాతో పాటు మరో 11 మంది నిందితులను ఈ ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. ఐడీబీఐ బ్యాంక్ మాజీ జనరల్ మేనేజర్ దాస్ గుప్తా పేరును కూడా ఇందులో యాడ్ చేశారు.