KTR సార్ మీరే కాపాడాలి.. మల్యాలకు చెందిన గల్ఫ్ బాధితుడి ఆవేదన

KTR సార్ మీరే కాపాడాలి.. మల్యాలకు చెందిన గల్ఫ్ బాధితుడి ఆవేదన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో గల్ఫ్ బాధితుడు తన గోడు చెప్పుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన సురేశ్ అనే యువకుడు.. దుబాయ్ లో తాను పడుతున్న కష్టాలను చెప్పుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న దుబాయ్ వెళ్లిన సురేశ్.. ఏజెంట్ మోసానికి బలయ్యాడు. భవన నిర్మాణ మేస్త్రీగా పని ఉందని చెప్పి.. అక్కడికి వెళ్లాక కూలీ పనులు చేయిస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఎలాగైనా ప్రభుత్వం స్పందించి ఇండియాకు తీసుకెళ్లాలని కోరుతున్నాడు.