
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లకు మేలు రకం బెంగాలీ మామిడి పండ్లను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపారు. అలంకరించిన బాక్సుల్లో హిమసాగర్, ఫజ్లీ, లంగ్రా, లక్ష్మణ్ భోగ్ పండ్లను పెట్టి బుధవారం (మే 7వ తేదీన) ఢిల్లీకి పంపారు. గత ఏడు సంవత్సరాలుగాఈ సంప్రదాయాన్ని మమతా బెనర్జీ కొనసాగిస్తున్నారు.