
కోల్ కతా: బెంగాల్ లోని కూచ్ బెహర్ లో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ సందర్భంగా తృణమూల్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. దీన్ని అదుపు చేయడానికి కేంద్ర బలగాలు కాల్పులు జరగగా.. నలుగురు సాధారణ పౌరులు చనిపోయారు. ఈ విషయంపై బీజేపీ, తృణమూల్ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కూచ్ బెహర్ కు రాజకీయ నేతలను వెళ్లకుండా అడ్డుకోవడం పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు.
'మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్ గా ఎన్నికల కమిషన్ నామకరణం చేయాలి. బీజేపీ తన శక్తియుక్తులన్నింటినీ వాడినా ప్రజల నుంచి నన్ను దూరం చేయలేరు. ఇవ్వాళ కాకపోతే రేపైనా కూచ్ బెహార్ వెళ్లి అక్కడివారిని కలుస్తా' అని మమత పేర్కొన్నారు.