రేపు హత్రాస్  వెళ్తున్నా: మమతా బెనర్జీ

రేపు హత్రాస్  వెళ్తున్నా: మమతా బెనర్జీ

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన యువతి హత్యాచారంపై యావత్ దేశం అట్టుడుకుతోంది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ‘హత్రాస్ హర్రర్’ పేరుతో కోల్ కతాలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ …బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీలు, రైతులను టార్చర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా అనేది ఒక మహమ్మారి అయితే… బీజేపీ అనేది ఈ దేశానికి పట్టిన అతి పెద్ద మహమ్మారి అని దీదీ విమర్శించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి చేసే ప్రతి ప్రయత్నానికి తాను మద్దతు పలుకుతానని చెప్పారు. బాధిత కుటుంబాన్ని మేము కలవకుండా మీ పోలీసులు అడ్డుకుంటారని మీరు అనుకుంటున్నారా అంటూ బీజేపీని ప్రశ్నించారు. రేపు(ఆదివారం) తాను బాధిత కుటుంబాన్ని కలుస్తున్నానని… మీరు కనీసం గుర్తించలేదని అన్నారు. హత్రాస్ కుమార్తె తమకు కూడా కూతురేనని చెప్పారు. దళితులు, మైనార్టీలకు మద్దతుగా మనం ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. తాను హిందువును కానని, ఒక దళిత మహిళనని చెప్పారు దీదీ.