
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా ‘భ్రమయుగం’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
ఆగస్టులో ఈ సినిమాను ప్రారంభించిన మేకర్స్.. గురువారం మమ్ముట్టి 72వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో తన లుక్, స్మైల్‌తో భయపెడుతున్నారు మమ్ముట్టి.
హారర్ థ్రిల్లర్ జానర్‌లో కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది.