యువతితో చాటింగ్ చేశాడని యువకుడిని చంపేశారు

యువతితో చాటింగ్ చేశాడని యువకుడిని చంపేశారు

బెంగళూరులో దారుణం జరిగింది. అమ్మాయితో చాటింగ్ చేశాడని గోవింద రాజు అనే యువకుడిని నలుగురు వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులు అనిల్, లోహిత్, భరత్, కిషోర్ గా గుర్తించారు. గోవిందరాజు ఓ యువతితో చాటింగ్ చేశాడు. ఒక రోజు సదరు యువతి సెల్ ఫోన్ ఇంటిలో మరిచిపోవడంతో కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ ని పరిశీలించారు. అందులో గోవిందరాజుతో చేసిన చాటింగ్, వీడియోలను చూశారు. ఆ తరువాత గోవిందరాజు హత్య జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు అనిల్ ఆదివారం ఉదయం గోవిందరాజును ఇంటి నుంచి బయటకు పిలిచి బైక్ పై ఆండ్రల్లికి తీసుకెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు. అక్కడి వెళ్లాక గోవిందరాజుపై అనిల్ సహా మరో ముగ్గురు యువకులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గోవిందరాజు అక్కడికక్కడే మరణించాడు. ఘటన తర్వాత నిందితులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ఛాప్ చేసి.. మృతదేహాన్ని కారులోనే ఉంచి పరారయ్యారు. బాధితుడి బంధువులు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.