అక్రమ సంబంధం..పెండ్లి చేసుకోమంటే చంపిండు!

V6 Velugu Posted on Oct 09, 2021

  • దివ్యాంగురాలిని గొంతు పిసికి హత్య
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

శంషాబాద్, వెలుగు: దివ్యాంగురాలితో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోగా, ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో హత్య చేసి పరారైన ఘటన శంషాబాద్ పరిధిలో జరిగింది. శంషాబాద్ మండలం ఉట్​పల్లి ఇంద్రారెడ్డి కాలనీలో ఉండే దివ్యాంగురాలు యాదమ్మ(35)  టైలరింగ్ ​చేసు కుంటూ బతుకుతోంది. గురువారం నిద్రపోయిన ఆమె శుక్రవారం ఉదయం పొద్దుపోయాక కూడా లేవలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు తీసి చూడగా మృతి చెంది ఉంది. వెంట నే  పోలీసులకు సమాచారం అందించి,  అదే కాలనీకి చెందిన కృష్ణ యాదవ్ ను అనుమానిస్తూ కంప్లయింట్ చేశారు. అతడు కొంతకాలంగా యాదమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని పేర్కొన్నారు.   పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కృష్ణయాదవ్ గురువారం అర్ధరాత్రి యాదమ్మ ఇంటికి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది. దీంతో అతడి​ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యాదమ్మ పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతోనే అడ్డు తొలగించుకోవాలని ఆమె ఇంటికెళ్లి గొంతు పిసికి హత్యచేసి ఆరు తులాల బంగారంతో  పరారైనట్టు కృష్ణ యాదవ్  పోలీసులకు తెలిపాడు.  కేసు నమోదు చేసి యాదమ్మ డెడ్​బాడీని  పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించామని సీఐ ప్రకాశ్​రెడ్డి చెప్పారు. 

Tagged Hyderabad, woman, murder, Arrested, Man, , illicit

Latest Videos

Subscribe Now

More News