గచ్చిబౌలి, వెలుగు: నటి రేణుదేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన మరో వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన అప్పారావు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో రేణుదేశాయ్ పోస్ట్ చేసిన రీల్‌కు అనుచితంగా కామెంట్స్ చేశాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని విశాఖలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం అతడిని గురువారం రిమాండ్‌కు పంపారు.
