యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఎస్ఐ తాకీయుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పోలీసులు తుర్కపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బీబీనగర్ మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన పార్వతి లాలీ బైక్ పై కొమురవెల్లి వైపు వెళ్తున్నాడు.
అనుమానాస్పద రీతిలో కనిపించగా బైక్ ను చెక్ చేయగా అందులో 100 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్ నుంచి కొమురవెళ్లికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు. నిందితుడి నుంచిబైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
