అప్పు పైసలు తిరిగివ్వమన్నందుకు కత్తితో దాడి

అప్పు పైసలు  తిరిగివ్వమన్నందుకు కత్తితో దాడి

 ఎల్​బీనగర్, వెలుగు: అప్పు పైసలు అడిగినందుకు కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో దాడిచేసిన ఘటన వనస్థలిపురం పీఎస్​ పరిధిలో జరిగింది.  హస్తినాపురానికి చెందిన ముసలారెడ్డి(59) కొన్ని నెలల కింద వనస్థలిపురంలో ఉండే వెంకట రెడ్డికి రూ.60వేలు అప్పుగా ఇచ్చాడు. వెంకటరెడ్డి స్థానికంగా కొబ్బరిబోండాల వ్యాపారం చేస్తుంటాడు. అప్పు పైసలు అడిగేందుకు ముసలారెడ్డి మంగళవారం వెంకటరెడ్డి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటమాట పెరిగి వెంకటరెడ్డి కొబ్బరిబోండాల కత్తితో ముసలారెడ్డిపై దాడిచేశాడు. గాయపడిన ముసలారెడ్డి నేరుగా వనస్థలిపురం పీఎస్ కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.