- ఎల్ఓసీ మంజూరు చేసిన మిషన్ భగీరథ ఈఎన్సీ
హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు పైపులైన్ల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులకు నిధులు కేటాయించింది. మొత్తం రూ. 45.71 కోట్లు విడుదల చేస్తూ మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కృపాకర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచినందుకు ఇప్పుడు ఎల్ఓసీ మంజూరు చేశారు. దీనికి సంబంధించి రూ.45.71 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
