కూకట్పల్లి, వెలుగు: నమ్మిన వ్యక్తే తనను మోసం చేయడంతో ఓ యువకుడు పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని భీమవరానికి చెందిన ఆనంద్వరప్రసాద్(28) ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈయనకు ఇటీవల ఢిల్లీ నుంచి నగరానికి వస్తుండగా ట్రైన్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఆ వ్యక్తిని ఆనంద్ డబ్బు సాయం కోరాడు. వీరిద్దరు కారులో పెద్ద అంబర్‌పేటకు వెళ్లారు. ఆనంద్‌ను కారులో ఉంచిన సదరు వ్యక్తి, కూకట్‌పల్లిలో నివసించే ఆనంద్ అక్కకు ఫోన్ చేసి కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. నీ తమ్ముడు ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడని, అరెస్టు చేయకుండా ఉండాలంటే డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె ఆనంద్ ఖాతాకు రెండు దఫాలుగా రూ.లక్షా 34 వేలు పంపింది.
ఆ మొత్తాన్ని ఆనంద్ ఏటీఎం నుంచి సదరు వ్యక్తి తీసుకుని పారిపోయాడు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఆనంద్ ఫిర్యాదు చేశాడు. శుక్రవారం కేసు నమోదు చేసి సైఫాబాద్‌కు బదిలీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పీఎస్ నుంచి బయటకు వచ్చిన ఆనంద్ ఎలుకల మందు తాగాడు. పోలీసులు సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతున్నాడు
