మహిళపై యూరిన్ పోసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా నిషేధం

మహిళపై యూరిన్ పోసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా నిషేధం

విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా మద్యం మత్తులో  ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత బాధితురాలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శంకర్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో శంకర్ మిశ్రా కొన్ని రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగాడు. ఎట్టకేలకు ఈ నెల 7వ తేదీన పోలీసులు అతడిని బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ.. కోర్టు తిరస్కరించి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.