వికారాబాద్, వెలుగు: జొన్న చేనుకు కాపలాగా వెళ్లిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని బిల్కల్ గ్రామానికి చెందిన చేరాల నర్సింహులు (39) గురువారం రాత్రి తన జొన్న చేనుకు కాపలాగా వెళ్లాడు. శుక్రవారం ఉదయం భార్య వసంత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో చేను వద్దకు వెళ్లి చూసింది. ముఖం, తలపై రాళ్లతో కొట్టిన గాయాలతో విగతజీవిగా పడి ఉండడంతో అదే గ్రామానికి చెందిన పలువురు అనుమానస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు.
